కనపడి పోరాదా
కనపడి పోరాదా


ప౹౹ కందిపోయే మోము దానా కనపడి పోరాదా అందిపోయే గోము చానా అడకగనే రారాదా ౹2౹
చ౹౹ నెలవంక నిన్నే చూస్తున్నది నిలబడి ఉండవా పాలకంకి పరువం పరుగిడ నీవు కల్సుండవా ౹2౹
మధురమైనదిలే ఆ తలపు మరీ మరీ తలచ సుందరమైనదిలే ఆ కలలోనే కోరి కోరి వలచ
౹ప౹ చ౹౹ ఊరికే చూడకు అలా ఊరించి నా మనసునే ఉరికే జలపాతమేనూ అది సారించి చూడనే ౹2౹
కోరుకున్నానులే నీవే మరి అవునే అన్నావని చేరుకున్నానులే చేరువునే చేరుకోమన్నావని
౹ప౹ చ౹౹ కలహంస నడకనూ కన్నార్పక నే చూడలేను కల ఊహించి కనుల భారమే నే తగ్గించలేను ౹2౹
కరిగిపో గుండెలో కలకాలం అలా కలిసిపోను తరిగిపోని తనువులనే ఒకటిగా మిగిలిపోను ౹ప౹