STORYMIRROR

# Suryakiran #

Romance

4  

# Suryakiran #

Romance

కలసి సాగే వరమియ్యవా !

కలసి సాగే వరమియ్యవా !

1 min
436

నూరేళ్ళ జీవితాన్ని కోరేవారే మనలో అందరు .

మమతానురాగాలకు బందీ కారెవరు ?

గాలి , నీరు అమోఘమైన ప్రవాహం కలవి .

మొదటిది తనను తానే కదిలించుకునేది .

రెండవది వయ్యారంగా ధారలా ఒలికేది .

ఐనా , పిలుపుకు ఏమాత్రం స్పందించలేవవి .

తమపని తాము సకాలంలో చేసుకుపోయేవి .

మనిషి పలకటమేనా ప్రేమనూ కురిపించగలడు .

తన్మయత్వంలో ముంచి మురిపించగలడు .

అందుకేనేమో నూరేళ్ళే అధికంగా జీవితం .

కొత్తకొత్తవారూ అందుకునేలా ఆ అనుభవసారం .

ఈ నిడివిలోనే ఏం చేసినా మొత్తం ప్రయాణం .

నీకోసమే పులకింతల సమ్మోహిత కలలకౌగిళ్ళు .

రెప్పలనూ వాల్చని  ఎదురుచూపుల కళ్ళు .

నా ఎదలో చేరి సుమధుర గానం చేయమని ,

మనోహరప్రాయం ఇరువురి చేజారనియ్యకని .

ప్రేమదీపం కన్నుల పండువగా వెలిగించమని ,

కలసి పండుటాకులమయ్యే వరమియ్యమని !

*** # *** # ***




Rate this content
Log in

Similar telugu poem from Romance