కలలే జీవితం
కలలే జీవితం
మనిషితనాన్ని
మరచిపోయిందా జగము,
అంగడి ఆటబొమ్మే అయ్యిందా దైవము,
అంతు చిక్కునా
మానవ నైజము,
జీవితానుభావమే చెబుతుంది
నేతిబీరలోని పరిమళము.
కలలో పయనిస్తే
చరిత్రలో నిలవవు,
పాండిత్యాన్ని ప్రదర్శిస్తే చరిత్ర నిను మరువదు,
అవాంతరాలను అధిగమిస్తేనే
గెలుపు నీదగను,
జవాబు తెలియని ప్రశ్నలతో నిండినదే
జీవితపుస్తకము.
ఆవేశం అంటేనే వేడిపాలలో
వెన్న చూడడము,
వెలుగుల రేడుతో
ఆటే విడ్డురము,
ఊతమైన విజ్ఞానంతో ఆటుపోట్లు
ఎదుర్కుంటేనే విజయము,
కరిగిపోయేటి
కమ్మని కలలో సాగిపోవడమే అయోమయము
వాస్తవ జీవితమే సుఖప్రదము
