కలికి
కలికి


ప౹౹ చిగురించనీ చిరుయత్నం చినదాని ప్రేమలో మరిపించనీ మరులతోనే మనసైన లేమతో ౹2౹
చ౹౹ అక్కరంతా కలబోసి అక్షరాలూ చేసి రాసినే చక్కెరంతా కలిపేసి చేరేసే పలుకులా రాశినే ౹2౹
తనదైన మది తలపునే మనసున నిలుపనే మనసైన మగువకు మనసంతను తెలుపనే
౹ప౹ చ౹౹ కోరికే తనువంతనూ కొరికేసి గాయం చేసినే ఊరికే చూడక ఉలుకంతనే సోద్యం చూసినే ౹2౹
కనికరం చూపి కార్ఛిచ్చునే నీవు మాపగలేవ హానికరం కాదూ ప్రేమంటే దయ చూపగలేవ
౹ప౹ చ౹౹ తీరని దాహానికి తీరికాలేదు కనిపించకా పైకి తీయని వలపును తీగలాగ సాగనీ లోలోనికి ౹2౹
చెలువా చేరదీసి చెలిమిని కొనసాగించలేవా కలువా కళ్ళతోటి కలికిలానే కనిపించగలేవా ౹ప౹