Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Ramesh Babu Kommineni

Romance


4.8  

Ramesh Babu Kommineni

Romance


కలిగించకే

కలిగించకే

1 min 353 1 min 353

ప౹౹

కలిగించకే కలవరము కనిపించి నా ముందు

వెంబడించకే యోచన వెలిగించి మది నందు ౹2౹


చ౹౹

మనసులో మంటలే పెంచే మరులన్నీ కలసి

ధనసులా దరిచేరి ఎలమి గురి బాగా తెలసి ౹2౹

తనువు తమకం తీర్చ తామసమేల తరుణి

అనువు కాదనక అందించివా వలపు వారిణి ౹ప౹


చ౹౹

స్వాగతించనూ సమయమే స్వాధీనపరచనే

స్వగతం ఆలకించి ఆ ఎడద కుదుటపరచనే ౹2౹

మననమేలా మరలా ఆ మార్పు చేర్పులతో

జననమే ఆ ముసిమితో కూర్చే కూర్పులతో ౹ప౹


చ౹౹

కోరికై కౌగిలించి ఆశలా చిగుర్చి నినదించవా

తీరికాచేసి తీయని కబురే నాకు వినిపించవా ౹2౹

మరిచిపోని జ్ఞాపకాన్ని మనకూ మిగల్చలేవా

మరీచకను ప్రేమ పచ్చికతోనే తొలగించలేవా ౹ప౹Rate this content
Log in

More telugu poem from Ramesh Babu Kommineni

Similar telugu poem from Romance