కల
కల


ప౹౹
ఏమయిందో నా హార్ట్ కు ఎమని చెప్పను
ఒట్టేసి చెపుతున్నా చెప్పలేను ఆ గొప్పను౹2౹
చ౹౹
ఒకనాటిది కాదులే ఈ కల వివరించనూ
మళ్ళీమళ్ళీ రాదులే ఎలా సవరించనూ ౹2౹
వేకువ కల వెన్నాడి ఎడదనే పండించగా
వేణువు రాగంలా మదినలా నిండించగా ౹ప౹
చ౹౹
కొత్త కోరికలే కోరి చేరి నింపినే మరులతో
వింత ఊహలే కబురులే పంపే తారలతో౹2౹
వరించిన వర్తమానం పెంచే ప్రేమతరువు
ఊరించిన మనసుకే ఊరటే ఆ ఉత్తరవు౹ప౹
చ౹౹
కలసి కలలో చెప్పే కబురులే కమనీయం
వలసి వచ్చే ప్రేమ కుబేరులే వందనీయం౹2౹
ఎదలో ఎలబారినే ఎల ప్రాయపు ఎలమి
కథలో మాదిరి కలకూడాను తెచ్చే కలిమి౹ప౹