STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

కారణం

కారణం

1 min
318

కారణమేది తెలియదు కామితమే దాచేయను

రణమేదో చేయును ఆ మదినే ఇక దోచేయను

ప్రాపకమే లేకుంటే పల్లవించునా వలపుతనం

ప్రాభవమే ప్రాప్తించదే వెచ్చించకా ఎలమిధనం

తలపులో తన్మయం తరగదే ఊహించి రూపం

తనువులో ప్రళయం పెరగదా శాసించి తాపం

కారణమేది తెలియదు కామితమే దాచేయను

రణమేదో చేయును ఆ మదినే ఇక దోచేయను


కోరికే కొరివిగా మారి దహించి వేయకపోవునా

ఊరికే వలపు నెగడు రగిలించినా మాయునా

చూసి చూడక పోయినా మనసే ఊరుకోదుగా

వేచి కాచి ఎడద సైతం కాసేపైనా ఉండలేదుగా

కారణమేది తెలియదు కామితమే దాచేయను

రణమేదో చేయును ఆ మదినే ఇక దోచేయను

ప్రాపకమే లేకుంటే పల్లవించునా వలపుతనం

ప్రాభవమే ప్రాప్తించదే వెచ్చించకా ఎలమిధనం


నువ్వు నేను కలిసాక ఆ దిగంతాలు దిగిరావా

పువ్వు నవ్వు ఏకమై హారతి పట్టను ఆగిపోవా

ఊహలో ఊరించేసి మనసు ఊయల ఊపకు

ఊసులో ఊరడించి అరమరికలనేవి చూపకు

తలపులో తన్మయం తరగదే ఊహించి రూపం

తనువులో ప్రళయం పెరగదా శాసించి తాపం

కారణమేది తెలియదు కామితమే దాచేయను

రణమేదో చేయును ఆ మదినే ఇక దోచేయను



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance