కాపు కరోన్నుండి
కాపు కరోన్నుండి


ఆ.వె.
హనుమ! పవన తనయ! యనిలాత్మజా! వజ్ర
కంఠ! లంక దాహి! గాలి చూలి!
కరుణ జూపి మమ్ము కాపు కరోన్నుండి
వందనములు నీకు వాయుపుత్ర
ఆ.వె.
కాశి నాథ కాలకంఠ గంగాధర
చంద్రమౌళి రుద్ర జంగమయ్య
కరుణ జూపి మమ్ము కాపు కరోన్నుండి
వందనాలు నీకు వామదేవ