కాలమే గురువు
కాలమే గురువు
కాలమే గురువు.
(తేటగీతిమాలిక )
కాలమే గురువుగ వెంట కలిసి నడచి
మంచి పాఠముల్ తగురీతి మనకు నేర్పు
దెబ్బ వేయుచు మనుజులన్ దీర్చిదిద్ది
గొప్ప చదువులన్ బోధించు గురుతుగాను.
పాఠముల్ చెప్పి గురువులు ప్రశ్నవేసి
కక్ష్య కక్ష్యకు మార్చుట కలదు భువిని
ముందుగా పరీక్షలు పెట్టి ముఖ్యమైన
కక్ష్య లోనికి నెట్టునీ కాలమాహ!
సమయ మెప్పుడూ ముగియక సాగుచుండు
సాత్త్వికంబగు తత్త్వమున్ జదువుకొనుచు
సంఘమందున మెల్గిన సాధుమతుల
కాలమను గురుదేవుడు గాచుకొనును.
కర్త నేనను భావన కలిగి నపుడు
కామమోహముల్ మనిషిలో కలుషితములు
కలిపి నప్పుడీ తుదలేని కాలమూర్తి
పాశమున్ బెట్టి కొట్టును బ్రతుకుయందు.
దైవమే గురువుగ మంచి దారి చూపి
బ్రతుకు నిలబెట్టు చుండును బంధువగుచు
నట్టి వేలుపు పాదముల్ పట్టి కొలిచి
సమయమందున జనులెప్డు సాగవలయు.//
