జ్ఞానబీజాలు
జ్ఞానబీజాలు
జ్ఞాన బీజాలు.
(గేయం )
అ ఆ ఇ ఈ లు నేర్చేద్దాం!
అక్షరాలను వేగంగా దిద్దేద్దాం!
అజ్ఞానాన్నివెంటనే వదిలేద్దాం!
అంధకారాన్ని మడతేద్దాం!
అగ్గిలోనికిప్పుడే తోసేద్దాం!
భగ్గుమనిదాన్ని మండిచేద్దాం!
వెలుగు దారిలో నడుద్దాం!
విలువైనవన్నీ ఏరుకుందాం!
బుద్ధిలోన దాచేసుకుందాం!
శుద్ధంగా మదిని దున్నేద్దాం!
జ్ఞాన బీజాలను చల్లేద్దాం!
ప్రాణంగా వాటిని కాచుకొందాం!
నిర్మలమౌ జలాన్ని పోసేద్దాం!
ధర్మాంకురాలను పోషిద్దాం!
సాత్త్విక ఫలాలు పండిద్దాం!
తాత్త్విక సంపద పెంచేద్దాం!
ఘనమౌ పెన్నిధిని పంచేద్దాం!
మనదేశాన్ని నడిపించేద్దాం!//
