జన్మలు గా
జన్మలు గా
కుడి కన్నే ద్వారంగా ఎదురు చూపు..జన్మలుగా..!
ఎడమ కన్ను కిటికీగా ముందు చూపు..జన్మలుగా..!
ఈ తీరని విరహానికి తెరతియ్యర చెలికాడా..!
కడతేరని స్వప్నాలతొ వలపు చూపు..జన్మలుగా..!
ఈ కదలని నా పెదవుల ఎదలోయల నీ పేరే..!
జపియిస్తూ తపియించే పిలుపు చూపు..జన్మలుగా..!
నా మౌనపు కోవెలలో వెలుగుతోంది నీ రూపే..!
ఎల కోయిల పాటలాంటి చిగురు చూపు..జన్మలుగా..!
ఈ శ్వాసకు సాక్షిలాగ ఉన్నావని తెలిసెనులే..!
నీ అడుగుల సవ్వడికై నిలువుచూపు..జన్మలుగా..!
