STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

జీవనగరిలో

జీవనగరిలో

1 min
1


అమ్మవు నీవే,

అనుబంధపు అమృతం నీవే,

తరలివచ్చు ఆకలి తీర్చే దేవతనీవే.


వసంతం తెలియని అడవిబ్రతుకున

మోడుబోయిన తలపుల బాటసారి నీవే,

కష్టాలు లెక్కించని మనోవనాన్ని పసికందుకు చూపేది నీవే,

చీకటింట వెలుగుదీపమైన ఆశగా కదలవే.


పిరికితనంలేని బ్రతుకులో

ఆత్మవిశ్వాసపు ఉనికి నీవే,

పరిమళ మనసుల వనరాణిబిడ్డగా చెట్టుచేమల నేస్తంనీవే,

పచ్చని చెట్టుగా కుటుంబానికి ఆసరాగా నిలిచిన

చేతనత్వం నీవే,

రెప్పల మాటున దాగిన

బిడ్డ భవిష్యత్తును

విరామం లేని విశ్రాంతితో కనులముందు నిలుపుకునే ఆశాజ్యోతివి నీవే,

సృజనానందపు మణిహారమై

మహిలో నిలిచిన సబలవు నీవే



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics