జీవితం
జీవితం
జీవితం అంతా సూన్యమే..
చుక్కలు లేని ఆకాశంలా
ఎప్పుడో ఒక్క సారి వచ్చే
అందమైన వెన్నెల వెలుగులు
సమసి చీకటిని తాకుతూ
వీడ్కోలుతో అంతరించి
మళ్ళీ ఉదయించడమే..
ఈ మాయా జగతిలో మిగిలింది ఏముంది
కలేభరాలను తనలో కలుపుకున్న
భూమి తల్లి ఆర్ధనాలు తప్ప
చూస్తున్నదేదీ నిజం కాదు
నువ్వు నీ మనస్సాక్షి తప్ప
ఆశాశ్వితమైన బంధాలకోసం
అహర్నిశలు కష్టపడడమే జీవితం
చావు పుట్టుకలు మనం రాసుకునే
చరిత్ర కాదు మనల్ని కాలరాసే విధి చేతిలో
చిక్కిన బందీలం
ఆత్మీయులకు ఏది జరిగినా
విలపిస్తూ ఉంటాము
మనం చివరి మజిలీకి దగ్గరగా ఉన్నాము
అని మరచి
ఒక క్షణం విచిత్రం
ఇంకో క్షణం మాయ
మరో నిముషం సూన్యం
శాశ్విత ఆశాస్విత రణరంగం
