STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

జీవితం

జీవితం

1 min
273

ఒక కన్నీటి చుక్క

గుండెను

తడిచేస్తుంది..!!


చిటికెడు ద్వేషం

నిలువెల్లా…

విషాన్ని నింపుతుంది.!!


ఎడారి జీవితం

ఎంత నడిచినా

ఇసుకదిబ్బతీరే..!


పొడిబారిన

మనస్సుకు

తనువే భారం!


ఎంత వగచినా

ఫలమేముంది

చింత నీలోనే వుంది.!


దారెంట చీకటి

ఒక్క మిణుగురు చాలు

దారి చూపనీకి..!!


ఆశ మంచిదే కానీ,

ఆత్యాసను దరిచేరనిస్తే

మిగిలేది నిరాశే…!!


పగిలిన హృదయాన్ని

అతుకేసుకోవద్దు

కారిపోనీ బాధంతా…!!


అమాసనాడు

వెన్నెల కోసం చూడొద్దు

కన్నులు కాయలు కాస్తాయి!


ఆకాశం నుంచి

జారే ప్రతీ చినుకు

ఓ విత్తనానికి ఊపిరి పోస్తుంది..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance