జీవితం
జీవితం
జీవితనిచ్చింది..
కడుపునిండా నాలుగుముద్దలు
తినేలా చేసింది...
ఆశల్ని రేపింది...
అవసరాలను తీర్చింది....
అనుకున్నా లక్ష్యం నేరవేర్చేలా చేసింది...
నోటిమాటకు విలువ పెంచింది...
సమస్యలు చుట్టుముట్టిన సందర్భంలో
ఓదార్పు నిచ్చింది...
నేనున్నా అని దైర్యం చేపింది...
నెల నెల కు ఆత్మవిశ్వాసం నింపింది...
కష్టాలను దూరం చేసింది....
ఉన్నతస్థితిలోకి బాటలు వేసింది....
ప్రతిముఖంలో నవ్వులు సంతోషాలు విరబూసేలా చేసింది...
ప్రతికార్మికుని ఆయుధమై నిలిచింది....
