జీవితం
జీవితం
ఇతరులతో ఎలా సంభాషించాలో,
తప్పుచేస్తే క్షమాపణ అడగగలగడం,
నిజాయితీగా ఉంటూ ఏదైనా పొరపాటు చేస్తే
వెంటనే ఇతరులమీద తొయ్యకుండా,
మన తప్పుకు మనమే బాధ్యత తీసుకోగలగడం
మన పెద్దలను, గురువులను, ఆత్మీయులను
గౌరవించి, నిన్ను నీవు ప్రేమించుకొంటూ
నీ చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా
తోడ్పడుతూ ముందుకు సాగినప్పుడే
నీవు జీవితంలో నిజంగా ఎదిగినట్టు.
పెద్ద చదువులు చదివినంత మాత్రాన
డబ్బు దర్పం ఉంటె మనిషి ఎదిగినట్టు కాదు,
జీవిత పాఠాలు నేర్చుకొని బతుకు బడిలో
గెలిచినప్పుడే నీవు నిజంగా ఎదిగినట్టు.
పైన అన్ని పాటించలేకపోయినా నిన్ను
నీవు మనిషిగా అర్ధం చేసుకొని వ్యక్తిత్వ
వికాసానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉండడమే
మానవ పుట్టుకకు అర్ధం ,పరమార్ధం. ఏమంటార
