STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

జీవితం

జీవితం

1 min
254

                            

ఆరెండు కన్నీటి చుక్కలు

కనుకోనలలో వేళాడుతున్నాయి

వాలే భుజం లేక…..

ఆ రెండు మాటలు

నాలికను చిధిమేస్తూ

గొంతుకలో నొక్కివెయ్యబడుతున్నాయి

వినే మనసు లేక…..

ఆ విసుగు నిస్పృహై

శూన్యంలోకి జారిపోతుంది

ఆశకు ఆసరా లేక…..

ఆ తనువు తనను తాను శిక్షించుకుంటూ

మరణాన్ని ప్రేమించి నిష్క్రమించింది

హత్యో ఆత్మహత్యో ముద్దాయిలెవరో

తేల్చుకోలేని ప్రశ్నలను

మనకు వదిలేస్తూ…..

మనంఆ మనసులను

ఆ ఆ అంతరంగపు లోతులను తడమగలిగి

వారి ఆత్మలను ముద్దాడిఉంటే

ఒక మాట, ఒక చేయూత, ఒక ఆసరా, ఒక సహానుభూతి, ఒక ఆశ….ఇచ్చివుంటే

ఎన్ని కొత్త చిగురులు తొడిగేవో కదూ ఆ జీవితాలు.

చిదిమేసుకున్న ప్రతీ జీవితం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది…!!!

 


Rate this content
Log in

Similar telugu poem from Inspirational