జీవితం
జీవితం
జీవితంలో రానున్న కాలం ఎన్ని మలుపులో ఊహించగలమా
మదిలో జరిగే సంఘర్షణ ముందే తలుపులో ఊహించగలమా
ఉదయించే సూర్యుడిని అరచేత్తో ఆపగలమా
అందని ఆకాశానికి నిచ్చెనలు వేయగలమా
అంది అందని జీవితం అందలమే అందుకోగలమా
మేధావి అయిన కాలానికి పాఠాలు నేర్పగలమా
గతం తాలూకు జ్ఞాపకాలూ నీడలా వుంటే ముందుకు వెళ్ళగలమా
పాఠాలు గుణపాఠాలు హెచ్చరిస్తుంటే నిరూపించగలమా
మిలమిల మెరిసే నక్షత్రాల సంఖ్య లెక్కించగలమా
అనుకోని పరిస్థితులు నిమిత్త మాత్రం అని సర్ధుకోగలమా
