జీవితం గడపటం కష్టమే
జీవితం గడపటం కష్టమే
ద్వేషాన్ని తుంచుతూ మనసులో చోటునే ఇవ్వడం కష్టమే
మదిలోన ప్రతిసారి అనురాగ సుధలనే నింపడం కష్టమే
వెలిగేటి కనులలో శిథిలమైపోయింది ఆ రూపు ఎప్పుడో
తన కొరకు ఈనాడు రమణీయ కావ్యాన్ని రాయడం కష్టమే
మలిజాము గడిచినా కవ్వించు కలలకే తెలవారనే లేదు
చెలియ చెక్కిళ్ళలో సిగ్గులను గుట్టుగా దాచడం కష్టమే
నిన్నలో శూన్యమే హృదిలోన మౌనమై చేరింది నా తోడు
పల్లవెరుగని చిలుక పలుమార్లు నీ గీతి పాడడం కష్టమే
కాలాన్ని దాటేసి బాధల్ని దిగమింగి బతకాలి వసంతా
బంధాలు తెంపేసి వేరుగా జీవితం గడపడం కష్టమే
