జాతిని మేల్కొలపండి
జాతిని మేల్కొలపండి
జాతిని మేల్కొలపండి.
శ్రామికులారా!రారండీ!సంఘటితమై కదలండీ!
సమసమాజ స్థాపనకై జాతిని మేల్కొలపండీ!
శ్రామిక దినోత్సవ వేడుకల్లో మునుగుచు
సభలు సమావేశాలు జరుపుకొనుచు
పాత రోజులను మరువవద్దు పట్టిన పంతం విడవద్దు
సమస్యల సాధనకై కలిపిన కరములు విడవద్దు.
వేతన జీవులై విధులు గడుపుతూ
శ్రమ శక్తిని రంగరించి దేశాన్ని మోసుకెళ్తూ
సేవారంగంలో సిద్ధహస్తులై చరిస్తూ
ప్రజానీకానికి బంధువులైన
కార్మికులారా!రారండీ!
ఆకాశమే హద్దుగా అడుగు ముందు కేయండీ!
మీ శక్తి సామర్ధ్యాలే దేశానికి జీవమిడగ
మీ బుద్ధి చైతన్యమే ధరణిలో వెలుగు నింపగ
మీ స్వేదజలమే ప్రజానీకానికి ప్రాణమీయగ
మీ భుజబలమే జాతికి వెన్ను దన్నుగా
నిరంతరము నిల్చియున్న శ్రామికులారా!
సమసమాజ స్థాపనకై జాతిని మేల్కొలపండీ!//
