జాబిలి
జాబిలి


ప౹౹
వెన్నెల ఏకాంతమే కలసిరాదా తీర్చ కోరికను
వన్నెలు ఆసాంతమే అలసి అలగినే మరికను ౹2౹
చ౹౹
జాము రాతిరైన కనపడవు జాలి లేని జాబిలి
రాము రామని చుక్కలే చేసే చీకటితోఅల్లిబిల్లి ౹2౹
మునిపే పంచుకున్న మురిపాలే జల్లుగకురిసె
తనపై పెంచుకున్న ఆ ఆశలు మదిలో మెరిసే ౹ప౹
చ౹౹
ఏల జాగేల ఎదురేగి ఎద మొత్తం మురిపించ
వేల ఊసులే ఎదురుచూసే ఆ కోరిక జరిపించ ౹2౹
ఉండిపోరాద గుండెలోగుడి కట్టను గురుతుగ
ఎండిపోనీక ఆ ఎలమినే వేడుకోన ఆతురతుగ ౹ప౹
చ౹౹
కోరిక బలమేమిటో కోరుకొన్న వారికే తెలుసు
చాలిక ఆ మౌనం దరిచేరను చూపకు అలుసు ౹2౹
జ్ఞాపకాల జావళీ జాలీగ జాలు వారే జలజలా
వ్యాపకాలే మాని ఓ జాబిలి ఏతెంచవ అలలా ౹ప౹