ఈ రెప్పల మాటు నీవు
ఈ రెప్పల మాటు నీవు
ప్రతి తెమ్మెఱ నీ పేరే..పాడుతుంటె బాగున్నది..!
ప్రతి చినుకూ నీ తలపుగ..ఊరుతుంటె బాగున్నది..!
నీ చూపుల వెన్నెలయే..కురిసేనా నా లోలో..
నా ప్రాణం దీపంలా..ఆడుతుంటె బాగున్నది..!
కాలం ఒక వింతపడవ..అవుతున్నది కన్నులెదుట..
నీ చేయే కలలవీణ..మీటుతుంటె బాగున్నది..!
మధురమైన దేదైనా..పరిమితమే అయితేనేం..
ఈ రెప్పల మాటు నీవు..కదులుతుంటె బాగున్నది..!
నీ అందెల సడి వినగా..గుండె ఎదురుచూపు చూడు..
ఆగిఆగి తియ్యగ తను..మ్రోగుతుంటె బాగున్నది..!
నీ కోసం పరితపించు..సంగతెంత మధురమోయి..
మెఱుపుపూలరాశి వెన్ను..నిమురుతుంటె బాగున్నది..!

