హస్త భూషణం
హస్త భూషణం
మనసు మురిసిన వేళ
సంతోషాల నేస్తం
మది తడిసిన వేళ
పంచుకునే ప్రియ నేస్తం
ఎన్నో వేళ జ్ఞాపకాల సమాహారం
మరెన్నో ఆలోచనలకు తొలి పథం
వేల భావాలకు పునాది
నైతిక సమాచారపు గని
పుస్తకం హస్త భూషణం
విలువైన విజ్ఞానపు ఆభరణం.
***%%%***
ఫణికిరణ్
02-11-2022
బుధవారం
07:23 pm
