STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

'హరీ!'శతకపద్యాలు

'హరీ!'శతకపద్యాలు

1 min
4


5.

చంపకమాల.


భవములడంచుమంచు నిను భక్తులు వేడుచు నార్తితోడ నీ

స్తవములు చేయుచుండ గని శక్తినొసంగెడి భక్తవత్సలా!

ప్రవిమల బుద్ధితో దరికి వచ్చిన నన్ను నిరాదరించకో!

దివిజనుతా!ముకుంద!కడు దీనను సాకుము ప్రేమగన్ హరీ!//


6.

చంపకమాల.


జయ జయ శ్రీకరా!యనుచు సంగతిగన్ నుతియించి భక్తులున్

నియతిగ వేచియుందురట నీ పడికావలి యొద్ద వేకువన్

బ్రియముగ దర్శనంబునిడి ప్రీతిని జూపెడి వేంకటేశ!నీ

దయగల వీక్షణంబుమెయి దగ్గర తీయవె నన్ను శ్రీహరీ!//




Rate this content
Log in

Similar telugu poem from Classics