హరిదర్శనం
హరిదర్శనం
మామిడి తోరణములను గట్టెను
ముంగిటరంగ వల్లులు దిద్దెను
దీపములను గృహమందు పెట్టెను
మక్కువతో పూమాలలు కట్టెను
కృష్ణుని కొఱకై గోపిక విజయా!
పాలుపండ్లను సిద్ధము చేసెను
తేనెలు రసంబులు తెచ్చి పెట్టెను
పాయసాన్నములు వండి పెట్టెను
పంచభక్ష్యములుచేసి యుంచెను
కృష్ణుని కొఱకై గోపిక విజయా!
తీరుగ తిలకము దిద్దుకొనుచు
సిగలో పూవులు ముడుచుకొనుచు
చందన లేపములలదుకొనుచు
సారెకు నద్దము చూచు కొనుచు
కృష్ణుని కొఱకై గోపిక విజయా!
వేళకు రాడని యలక చూపుచు
మాలికలన్నియు విసిరి వేయుచు
కఠినాత్ముడని కోపము చూపుచు
కన్నుల నీరిడి కలయ తిరుగుచు
కృష్ణుని కొఱకై గోపిక విజయా!
వేణునాదమే
వినిపించెనదిగో!
తులసీ పరిమళమిదిగిదిగో!
కంకణ కేయూర
ధ్వనులివిగో
పంకజ పాదాల సవ్వడులవిగో
చక్కని కృష్ణుడరుదెంచె విజయా!
నయనానందము మనోభిరామము
సర్వసిద్ధి ప్రదము శుభంకరము
జీవన్ముక్తికి యుత్తమ సోపానము
అభయప్రదము హరిదర్శనము
గోపిక జన్మ ధన్యమాయె విజయా!//
-----------------------
