STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

హరి నీకై నిల్చును

హరి నీకై నిల్చును

1 min
12

హరి నీకై నిల్చును..


(హరిగతి రగడ.)


విహితపు కర్మలు విధిగా సల్పిన 

వెన్నుడు నీ సరిజోడుగ నిల్చును 

సహనము జూపుచు నడిచిన పార్థుని 

సారథి నీ వెను వెంటనె వచ్చును.


జాతిని మేలుగ జాగృత పరచిన 

శాశ్వతుడౌ హరి సంపద లిచ్చును 

నీతిని వీడక నిష్ఠగ మెల్గిన 

నీరజనేత్రుడు నెమ్మిని జూపును.


కూళల సంగతి వీడిన చాలును 

గోపతి నీ కుల గోత్రము నిల్పును 

వేళకు పూజలు భక్తిగ చేసిన 

విష్ణువు విద్యల సారమొసంగును.


పాపపుటూహలు మానిన నీదరి 

పంకజనాభుడు పర్వులు పెట్టును

ప్రాపును గోరుచు నామము పల్కిన 

పావనమౌగతి మాధవు డిచ్చును.//


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics