హృదయం
హృదయం
రాణి హృదయం!
లేదు కదా నా కోసం సమయం!
మరచితివా బంగారం !
నీ రాక తెలిపెను విచ్చిన కలువలు!
నీవు వచ్చేవని పలికెను చిలుకలు!
వన్నెలు మెరిసిన సంధ్యాసమయం!
మురిసెను వికసిత రాణి హృదయం!
విరిసెను అందాల బృందావనం!
శరణం శరణం నీ పాదయుగళం!
నీ జాడ తెలిపెను కోయిల రాగాలు!
అంత దవ్వుల వినిపించెను
మురళీ నాదాలు!
మబ్బులు తెలిపెను
నీ మేని వర్ణాలు!
నీ పిలుపు విని నర్తించెను
నెమలి అందాలు!
ఎక్కడని వెతకను నీ మురళి గానమును
ఎవరుని అడగను ఎందదుoదు నీవు ఉందువని
నా అనుబంధాల తీరం ఎక్కడో
తెలియదు మరి
నీ అంతరంగ తలపులో లేకుంటిని
నా ప్రేమానురాగాలు నీ గుండెల్లో
నీ ఆత్మీయత అభిమానాలు
నా ప్రాణం లో
ఎక్కడ ఉన్నావో...

