STORYMIRROR

Triveni K

Fantasy

4  

Triveni K

Fantasy

హృదయ మాధవుడు

హృదయ మాధవుడు

1 min
373

చిక్కని వెన్నెల కిటికీ నుండి కనులను తాకింది

మగతనిద్రలోనూ చల్లనిగాలితో మనసు పులకరించింది

ఇంతలో ఎవరో వచ్చినట్టు వింత అలికిడి

కల ఏమో అనుకున్నాను

కాదునిజం నా హృదయ మాధవుడు వచ్చాడు

నా అణువణువు తీయని వేణుగానమై స్పృశిస్తూ

మగతనిద్రలోనుండి మత్తై బృందావన

విహారానికై తీసుకుపోయాడు

పదమై కదమై కదిలిపోతూ

పూలపరిమళమై చుట్టేస్తూ

తుమ్మెద ఝూంకారనాదమై మైమరింపచేశాడు

క్షణానికో రూపమై అలరిస్తున్న నా మనోహరుని

కళ్ళనిండా నింపుకున్నాను

మదినిండా అతడి వేణుగానాన్ని 

తనివితీరా ఒంపుకున్నాను

అతడి సాన్నిధ్యంలో నను నేను మరిచినవేళ

కలలకోనేటిలో ఈదులాడుకుంటూ

మరో తీరాన్ని చేరాడు

మళ్ళీ పున్నమివెన్నెలై నీ ఎదవాకిలి 

తడతానంటూ నెమలిపించదారి ననువదలివెళ్ళాడు



Rate this content
Log in

Similar telugu poem from Fantasy