STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

హోళి

హోళి

1 min
367

ఫాల్గుణ పౌర్ణమి పర్వ దినము

హోళికా వసంతోత్సవసంబరము

వర్ణమయమగు జల సందోహము

వేడుకల విహారము విజయ


సామరస్య భావనా మయము

నీమ నిష్ఠలతోడ జీవనము

కామారియే నిడ శుభానుగ్రహము

తామసత్వానికి చరమ గీతము

వేడుకల విహారము విజయ


త్యాగ బుద్ధితో మెల్గుచు జనము

సాగుచుండగా ధర్మ బద్ధ పథము

జగమంతయు ప్రేమ మయము

మిగలదులే కష్ట నష్ట కాలము

వేడుకల విహారము విజయ.


సౌభాగ్యములు పంచెడిదీ హోళి

దుష్టత్వముపై విజయమీ హోళి

కలివిడితనము నేర్పునీ హోళి

కలకాలము ప్రేమలు నిల్పెడి హోళి

వేడుకల విహారము విజయ


పిల్లల పెద్దల పండుగ హోళి

ఇంటింటా రంగులు జల్లెడి హోళి

వాడ వాడలా సందడించెడి హోళి

రాధాకృష్ణుల రాసకేళి హోళి.


Rate this content
Log in

Similar telugu poem from Classics