STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

గుండెలో

గుండెలో

1 min
2

మౌనమే పాటగా..వెలిగెనా గుండెలో..! 

కవనమే చెలియగా..చేరెనా గుండెలో..! 


పల్లకీ ఎందుకో..ఊహయే తేరుగా.. 

హాసమే తోటగా..మిగిలెనా గుండెలో..! 


కన్నులే కదలకే..ఉండునే చెలిమిలో.. 

ప్రేమయే ఊటగా..పొంగెనా గుండెలో..! 


ప్రాణమే మధువుగా..పాత్రయే తనువుగా.. 

జీవితం ఆటగా..మారెనా గుండెలో..! 


కష్టమో నష్టమో..లాభమే అనుభవం.. 

జ్ఞానమే తేటగా..ఊగెనా గుండెలో..! 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance