STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

గుండెకే గుండెలో..

గుండెకే గుండెలో..

1 min
318

గుండెకే గుండెలో గురిచూసి గుర్తుగా కొట్టావులే

ఉండలేని తనాన్ని మొండిగానూ కట్టబెట్టావులే

కబురు కోసం ఎదురు చూడని రోజే లేనే లేదుగ

గుబురు ప్రేమా అంకురమై పొమ్మన్నా పోలేదుగ

అంతేలే వలపుకే వందనమని జై కొట్టిపోవాలిలే

కథింతేలే అని కలవరంమాని ఎదను కలిపాలిలే

గుండెకే గుండెలో గురిచూసి గుర్తుగా కొట్టావులే

ఉండలేని తనాన్ని మొండిగానూ కట్టబెట్టావులే

మనసు మందిరంలో పదిలమై పరవశమయ్యే

ధనసు బాణంలా దారితప్పని దరహాసమయ్యే

ఎక్కడలేని తమకం ఎదలోనే ఎల్లువలాయెను

చిక్కడపోయి చిత్తంలోను కొత్త పల్లవలాయెను

గుండెకే గుండెలో గురిచూసి గుర్తుగా కొట్టావులే

ఉండలేని తనాన్ని మొండిగానూ కట్టబెట్టావులే

కబురు కోసం ఎదురు చూడని రోజే లేనే లేదుగ

గుబురు ప్రేమా అంకురమై పొమ్మన్నా పోలేదుగ

ఎన్నెన్ని క్షణాలు యుగాలై మారెనో లెఖ్ఖించావా

అన్నన్ని కణాలు తనువుతో ఓడెనో లిఖించావా

ఎన్నెన్ని క్షణాలు యుగాలై మారెనో లెఖ్ఖించావా

అన్నన్ని కణాలు తనువుతో ఓడెనో లిఖించావా

అంతేలే వలపుకే వందనమని జై కొట్టిపోవాలిలే

కథింతేలే అని కలవరంమాని ఎదను కలిపాలిలే

గుండెకే గుండెలో గురిచూసి గుర్తుగా కొట్టావులే

ఉండలేని తనాన్ని మొండిగానూ కట్టబెట్టావులే

రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance