గుండె పలకు
గుండె పలకు
కవి హృదయం తెలుసుకోరు
కలియుగము మట్టి మనుషులు
కాసులు లేవని కానరు కవిని
ఈ వట్టి మనుషులు....
కుల,మతం, జాతి బేధం
మా రుధిరంలో లేదు,
నీతి, రీతి వదులుకుంటే
ఎవరినీ వదిలేది లేదు.
కలం పడితే నిజాలన్ని
కాగితం పై పెడతాము,
కొన ఊపిరి వరకు
మా కలంతో సంధిస్తాము.
సమాజం హితం కోరి
సందేశం ఇస్తాము,
దారి తప్పే తరానికి
గమ్యం చేరుస్తాము.
గుండెలోన వాసమున్న
బ్రహ్మను కదిలిస్తాము.
కవి అస్త్రం బ్రహ్మస్త్రం కన్నా
ధీటైనదని తేలుస్తాము.
కవులను చులకన చేయకు
సరస్వతి ప్రియసుతులు వీరు,
యుగ యుగాలుగా కన్పించు
యుగ పురుషులు వీరు.

