STORYMIRROR

Midhun babu

Romance Classics

3  

Midhun babu

Romance Classics

గుండె చాటు రాగాలు

గుండె చాటు రాగాలు

1 min
184

గుండెచాటు రాగాలను..రాల్చుకొనుటే అవసరం..!

చిరునవ్వుల దీపాలను..నిలుపుకొనుటే అవసరం..!


పవిత్రమే అనుక్షణం..కాలం ఒడిలో చినుకులో.. 

ఆటలాగ జీవితాన్ని..తీసుకొనుటే అవసరం..!


నిద్రించే రాళ్ళు చూడు..ప్రేమికులకు చోటిస్తాయ్..

హృదయాన్ని రాయిలాగ..చేసుకొనుటే అవసరం..!


ఎవరిమనసు ఆకాశానికి..ఎగరకుండ ఉంటుందట..

ఊహల రెక్కలు విరగకుండ..కాచుకొనుటే అవసరం..!


ప్రేమనదిగ ప్రవహించే..విద్య ఎవరు నేర్పగలరు..

శ్వాససాక్షి వెలుగుదారి..పట్టుకొనుటే అవసరం..! 


చూస్తూ చూస్తూ ఓటును..నోటుకు బలి ఇవ్వడమా..

బుద్ధికింత సరిగ పదును..పెట్టుకొనుటే అవసరం..!


Rate this content
Log in

Similar telugu poem from Romance