గులాబీ
గులాబీ
ప్రేమ విన్నపాలు తెలుపునంటా గులాబీ,
గుండెలోని ప్రేమకు సరసరాగ స్వరాలు కూర్చునంటా గులాబీ.
మనసుచేయు ప్రేమతపస్సును నడతలలో చూపునంటా గులాబీ,
ప్రేమకు అనురాగపు సొగసులు అద్దునంటా గులాబీ
కలల రూపపు మనసుచిత్రపు
హృదయాన్ని పలికించునంటా గులాబీ,
కనురెప్పలతో ప్రణయగాథలు వినిపించులే గులాబీ,
ఊహల్లోని మైకపు
పెదవిచాటు కావ్యమేలే గులాబీ.
స్వార్ధపూరిత మనసుప్రేమను
ముళ్ళతో గ్రుచ్చుతుంది గులాబీ,
చంచలమైన మనసును
గుండెగూడు చేర్చవద్దంటుంది గులాబీ,
ప్రేమ తలపుల పుట్టింట్లో
జన్మల బంధపు మనసుకథగా మారాలని తలుస్తుంది గులాబీ
మౌనానికి మాటనేర్పు గులాబీ
పదముల కందని ప్రేమగా మారాలని తపిస్తుంది.

