STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

గులాబీ 🌹🌹🌹

గులాబీ 🌹🌹🌹

1 min
314

నీ తియ్యని చూపులలో..విరియునవీ గులాబీలు..!!

నీ నవ్వుల మెరుపులలో..కురియునవీ గులాబీలు..!!


గుండె లయల సవ్వడులకు పరిమళాలు అలదేవే..!!

నా ఆశల తోటలోన దొరుకునవీ గులాబీలు..!!


మౌనానికి మాట నేర్పు మధుర స్వర నిస్వనములు..!!

నా హృదయపు కోవెలలో వెలుగునవీ గులాబీలు..!!


శాంతి కొరకు పరుగులిడే శ్వాసలనే లాలించును..!!

నీ అడుగుల జాడలలో పొందునవీ గులాబీలు..!!


కోసి ఇవ్వలేనివిలే..చేతులెల చాచేవో..!?

నీదు సాక్షి బృందావని అందునవీ గులాబీలు..!!



Rate this content
Log in

Similar telugu poem from Romance