STORYMIRROR

Midhun babu

Abstract Romance Classics

4  

Midhun babu

Abstract Romance Classics

గోపిక నేనేరా గోపాలా

గోపిక నేనేరా గోపాలా

1 min
9

గోపిక నేనేరా... గోపాలా 

నీ గోపిక నెనేరా.......!


గోముగ గొల్ల భామనై 

గోరుముద్దలే నీకు తినిపించ


గోగుపూల గొడుగునై

గోపీ వల్లికల గారాలనే పలికించ


ఘడియ ఘడియనై

ఘట వెన్నల పొన్నలు పూయించ


ఘటోత్కచుని ఘటికనై

ఘనఘంటికల గమకాలు వల్లించ


యశోదమ్మ యశస్సుల

యంత్ర మహిమ యెదనై పులకించ 


బృందావన బదరికనై

భయభక్తుల భక్తితో నిను పూజించ


గోవర్ధనగిరి సిరి గీతినై

గంగాతీరాన గజ్జెల సవ్వడి వినిపించ...


గోపిక నేనేరా... గోపాలా నీ గోపిక నెనేరా...!!


  


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract