Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

గోడు

గోడు

1 min
23.3K


ప౹౹

గోడొకటుంది చెప్పు కోమంటావా గోముగా గొడవొకటి లేకుండ వినుకుంటావా ప్రేమగా ౹2౹


చ౹౹

చిలికి చిలికి గాలివానే చిన్నదాని వలపులో

కలికి మనసే కాఠిన్యమే చూడనే తలపులో ౹2౹


ఎదను మొత్తం ఎరుకపరచి వేడుకున్ననూ

కథను సాంతమే వినదే విని కనికరించనూ ౹ప౹


చ౹౹

ఊసులన్నీ సందేశాలుగా పంపినా ఉలకదే

ఆశలన్నీ కలబోసి అనువదించినా పలకదే ౹2౹


వినిపించిన వివరాల వివరమే ఆడగదుగా

కనిపించని నవ్వొకటి నవ్వేసి పోతుందిగా ౹ప౹


చ౹౹

మనసంతా మర్కటమాయే మాటాడలేకా

వయసంతా ఊరకనే ఉందిగ ఆటాడాలేకా ౹2౹


ఏమేమి చెయ్యాలో చెప్పరాదా ఓ జాబిలి

ప్రేమలోన గెలిచెసి తప్పించనూ ఈ ఉబిని ౹2౹


Rate this content
Log in

Similar telugu poem from Romance