గంధాల వానలో
గంధాల వానలో
గంధాల వానతో..పేచీలు పడలేను..!
చెలి ప్రేమ ధారలో..తడవకే మనలేను..!
చెలికురుల నీడలే..నిజనీలి మేఘాలు..
తన నవ్వుగా గాక..మెఱుపులే కనలేను..!
గగనాలు చుట్టేయు..కోరికయె లేదందు..
తనచుట్టు తిరుగు నా..తలపునే విడలేను..!
ఏ కడలి తీరమో..పిలిచేను నడిరేయి..
కనులనే తెఱవకను..చూడగా కలలేను..!
ఏ గాలి తరగల్లొ..తన పాట నింపునో..
సరిగమల విందనగ..మరి ఏదొ వినలేను..!
ఈ తోట కవ్వింపు..తోచెనా ఇంపుగా..
వర్ణింప లేనోయి..మదిచుట్టు వలలేను..!
