గజేంద్ర మోక్షం
గజేంద్ర మోక్షం
ఆపద మొక్కుల వాడా అనాథ రక్షకా
వడ్డీ కాసుల వాడా వెంకట రమణా
గోవిందా గోవిందా అని ఎలుగెత్తి పిలిచాము
మొసలి బారిన పడిన
గజరాజును కావగ
పరుగుపరుగున వచ్చితివట
సిరికిన్ జెప్పడు ..
అంత త్వరముగా
నా స్వామి వచ్చునని నమ్మితి
అను క్షణమూ కబళించుతూ
జాడ్యము బాధించుచున్నది
దాని బారి నుండి
మమ్ముల కావగ వేగిరము రావలె
ఆపద్బాంధవా శ్రీమన్నారాయణ మూర్తి!