STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

3  

Midhun babu

Classics Inspirational Others

గీతం

గీతం

1 min
1

పట్టలేను స్వరాలేవొ..నీచూపుల గీతానికి..!

నవరాగం వినిపించే..నీవెచ్చని మౌనానికి..!


ఎలాఉంది మనసంటే..మాటలేవి చాలవులే..

ఎడారేమి సరితూగును..వ్రాయరాని కావ్యానికి..!


నీ తలపుల పొంగలింక..చాలంటే వినవుకదా.. 

సిగ్గుపూల చేమంతులు..పూసేనా ప్రణయానికి..!


పదాలకై వెతుకుతుంటె..నిఘంటువై అందినావు..

లేపనాల అవసరమే..లేదు చూడ గాయానికి..!


విరహమనే ఊయలలో..ఊరేగే వేడుకలో.. 

రాచిలుకలొ గోర్వంకలొ..ఎందుకులే సాక్ష్యానికి..!


సంతసాల శాలలాగ..ఈ తనువును మలచితివే..

సమిధలుగా జ్ఞాపకాలు..రగిలేచితి మోహానికి..!



Rate this content
Log in

Similar telugu poem from Classics