STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఘనతనీది

ఘనతనీది

1 min
0



మరణభయం ఆసాంతం..వదిలించిన ఘనతనీది..!
ఇదియంతా సినిమాగా..చూపించిన ఘనతనీది..!

కృతజ్ఞతలు చెప్పనెలా..నేను మిగిలి ఉంటేకద..
రహస్యమేం లేదన్నది..వివరించిన ఘనతనీది..!

కాలానికి దూరానికి..బంధమెంత చిత్రమోయి..
ఈ లెక్కల కట్టడాలు..దాటించిన ఘనతనీది..!

కవనవీణ తంత్రులింట..శుభ నాదము మనోహరం..
కణకణమో మధుశాలగ..సృష్టించిన ఘనతనీది..!

లోలోపల దూకుతున్న..మెఱుపుతేనె జలపాతం..
చెలిమిపూల రాగాలను..అందించిన ఘనతనీది..!

ప్రతి తలపో కోకిలమై..పాడుతోంది ప్రణయగీతి..
ఏకాంతపు మాధురిలో..తేలించిన ఘనతనీది..!



Rate this content
Log in

Similar telugu poem from Classics