ఘనమమేదట
ఘనమమేదట
నిన్ను నీవు మార్చుకునే..పనికన్నా ఘనమేదట..!?
బాధమాటు కంటిచుక్క..తడికన్నా ఘనమేదట..!?
గ్రహపాటది ఏమిలేదు..పొరపాటుల ఇల్లు మనసు..
కోర్కెల గుడిగంటల..సడికన్నా ఘనమేదట..!?
అలవాటున కడలేమీ..నిదురిస్తూ కనదు కలలు..
అంటని వెన్నెల నవ్వుల..నిధికన్నా ఘనమేదట..!?
అర్థమవని తనమేమిటి..ప్రారబ్దము వదలకనే..
వెన్నుతట్టు అంతరంగ..శక్తికన్న ఘనమేదట..!?
వెంటాడే భయముగాక..అజ్ఞానం మరేం లేదు..
ఒక తియ్యని గడ్డిపరక..హృదికన్నా ఘనమేదట..!?
