గాలిపటం
గాలిపటం
గాలిపటం //(కవిత )
గాలి పటం గాలి పటం
అందరి పైనా గాలిపటం
ఆకాశములో గాలిపటం
రయ్యని ఎగిరే గాలిపటం
ఛయ్యని సాగే గాలి పటం
మెలికలు తిరుగుతు గాలిపటం
కళకళలాడుతు గాలి పటం
నింగిని తాకుతు గాలిపటం
నిలబడి చూచును గాలిపటం
రంగురంగులా గాలిపటం
రంజిలు వెలుగుల గాలి పటం
సూర్యుని చుట్టిన గాలి పటం
సోముని దాటిన గాలి పటం
తోకతో ఆడుతు గాలిపటం
దూకుడు పెంచిన గాలి పటం
ఇంద్రధనుస్సునే గాలిపటం
వెక్కిరించు మా
గాలిపటం
చక్కని నేస్తం గాలిపటం చిక్కని దొరకని గాలిపటం
గాలిపటం గాలిపటం //
