Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Ramesh Babu Kommineni

Drama

4.8  

Ramesh Babu Kommineni

Drama

ఎవరు పరిచితులు

ఎవరు పరిచితులు

1 min
411

ప౹౹

ఎవరయ్యా పరిచితులూ ఈ లోకంలో

ఎక్కడయ్యా చిరపరిచితులు శోకంలో ౹2౹

చ౹౹

అందరు అపరిచితులే కాలగమనంలో

మరి అందరు ఆ బాపతే ఆగమనంలో ౹2౹

ఎందరకి తెలుసు లోగుట్టు పరమార్ధం

కొందరికే తెలుసులే ఆ మర్మంలో అర్ధం ౹ప౹

చ౹౹

వచ్చేది ఒకరే తరువాత పోయేది ఒకరే

ఇచ్చేది ఆ పైవాడేనని ఎవరూ ఎరుగరే ౹2౹

ఎరుకలేని జీవితాన ఎందుకీ ఈ కొలత

కరకులేని మనసులోన ఎందరికో కలత ౹ప౹

చ౹౹

తనకందరు అపరిచితులేగ ఆ ఆత్మకైతే

మన జీవితకాలం ఒక రోజే దేవతలకైతే ౹2౹

అపరిచితులకా ఒకరోజు చేయకే వ్యర్ధం

పరిచితుడైన బ్రహ్మంనూ తలచిన అర్ధం ౹ప౹

Rate this content
Log in

Similar telugu poem from Drama