ఎవరీ సుందరి
ఎవరీ సుందరి
ఎవరీ సుందరి? ఇటుగా వచ్చింది?
నాజూకు అందాల సొగసులకు పందిరీ
రాజీవ నేత్రాల హరివిల్లు రంగవల్లి
సూదంటు రాయిలా ఎదలాగు కల్పవల్లి
చూసేటి చూపులే మన్మథుని శరాలయ్యి
బద్దున్ని చేసింది బానిసగ మార్చిందే
అధరాలు మధురాల పెరతేనె తేనెతుట్టె
పీయూష పాత్రలా మురిపించు ముద్దుగుమ్మ
పిలిచేటి పిలుపులే మంత్రాల మూటలయ్యి
ముగ్దున్ని చేసింది ప్రియతమా రమ్మందే
నెమలికన్ను నెరజాణా నేర్పుగానె నెరపిందే
అందాలను ఒక్కొక్కటి విసురుతూనె వొలకబోసి
మనసుతొలచి మరులుగొలిపి ఆడిందే పాడిందే
ఆటపాట లాడుతూనె నన్నుగెలిచి నిలిచింది...

