ఎటువైపు ఈ విధి వంచిత సంచారాలూ
ఎటువైపు ఈ విధి వంచిత సంచారాలూ
గుండె గదిలో చిరుదివ్వె చెరిపేసిన నా చిన్నారి !
చిరునవ్వు నవ్వుతూ దూరమైన ఓ వయ్యారి !!
నీవు లేని ఈ జీవన పయనాన ....
మస్తిష్క తటాకాన మదుపు లేని ఆలోచనలు
మనసు అంతరంగాన అదుపు లేని ఆందోళనలు
ఎంతకాలం ఈ గమ్యం లేని గమనాలు
ఎటువైపు ఈ విధి వంచిత సంచారాలు
సమయ సందర్భాలు లేని సంబరాలు
సంతోషపు ఆనవాళ్ళు లేని ఆడంబరాలు
నీ జ్ఞాపకాలతోనే ప్రతి క్షణం కాలక్షేపాలు
నీ నిరీక్షణలో దొరలిపోతూ కాలచక్రాలు ....
మరుజన్మకైనా చోటిస్తావా నీ వెచ్చని కౌగిలిలో
మరువక చెరుపక చేసిన బాసలనే..

