STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

ఎంత హాయి

ఎంత హాయి

1 min
279

ఎంత హాయి కలిగించినే ఆ సొంత హొయలే

వింత రేయి కదిలించినే అది కొంత మాయలే

వలపు సౌరభం వదలక వలపించి అపుడైనా

గెలుపు ప్రాభవం గేయమై వర్థిల్లూ ఎపుడైనా

కథలిక కనులిక చేరి కావ్యమై ఇక నర్తించునే

మెదలక మదిలోన మెరపులై అది వర్తించునే

ఎంత హాయి కలిగించినే ఆ సొంత హొయలే

వింత రేయి కదిలించినే అది కొంత మాయలే


పున్నమి నాటి పూలవనం పులకరించినటులే

ధన్యమే నేటి కల కవనమై పలుకరించినటులే

పున్నమి నాటి పూలవనం పులకరించినటులే

ధన్యమే నేటి కల కవనమై పలుకరించినటులే

వెన్నెల ఋతువూ వెలుగులు పంచి వేడుకగా

వన్నెల క్రతువూ వారధులునే పెంచి వాడుకగా

నవమినాటి జాబిలి నాజూకూ కానుకలిచ్చినే

కువమి కోరి కుతూహలంతోను దీవెనలిచ్చెనే

ఎంత హాయి కలిగించినే ఆ సొంత హొయలే

వింత రేయి కదిలించినే అది కొంత మాయలే

వలపు సౌరభం వదలక వలపించి అపుడైనా

గెలుపు ప్రాభవం గేయమై వర్థిల్లూ ఎపుడైనా


తీరిన దాహం తీరులెన్నో మారి తిరుగునులే

కోరిన భారం బరువులన్నీ వదలి కరుగునులే

అలసిన మదిలో అలలై అదుపు తప్పునులే

కలిసిన మనసున కలలే పొందు మెప్పునులే

కథలిక కనులిక చేరి కావ్యమై ఇక నర్తించునే

మెదలక మదిలోన మెరపులై అది వర్తించునే

ఎంత హాయి కలిగించినే ఆ సొంత హొయలే

వింత రేయి కదిలించినే అది కొంత మాయలే



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance