Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

ఎన్ని దారులో

ఎన్ని దారులో

1 min
296


ప౹౹

ఎన్ని దారులనో నడవాలి ఎడారిని దాటేందుకు

కొన్ని కలలైన కనాలి ఎదనే ప్రేమగ మీటేందుకు ౹2


చ౹౹

రేపు కూడా నిన్నేలే ఎంచిచూసిన ఆ ఎల్లుండికి

ప్రేమలో తావు లేదులే ఎన్నడూ మరి మొండికి ౹2౹

వాయిదాలు చెప్పక వచ్చి నిలుపు నీ మర్యాదే

ఖాయిలాలేని వలపే నీదని తొలగించు ఫిర్యాదే ౹ప౹


చ౹౹

వలపు గుర్రం ఎక్కాకను తానలపునే ఎరుగునే

తలపు స్వర్గం తలుపు తొలగి మైకం పెరుగునే ౹2౹

ఎన్నాళ్ళీ ఈ తీయని బాధ తీర్చగా నీవు రావా

కన్నీళ్ళే కనపడని మదనమే ముదమునే తేవా ౹2౹


చ౹౹

మనసులో యోచనే ప్రేమ యాచన మరి కోరద

వయసుతో పెరిగే ఆ కోరికేదో ఇప్పుడైనా తీరద ౹2౹

వేసారిన మదిలో ఎండమావిని ఇక తొలగించు

కాసారంతో ఎదలు కలుప జాగేలనో కౌగలించు ౹ప౹



Rate this content
Log in