ఎందుకు
ఎందుకు
ఎగసి పడని అల
ఉదయించని సూర్యుడు
స్పందన లేని గుండె
పోరాటం చెయ్యని జీవితం... ఎందుకు ?
ఆలోచన లేని ఆవేశం
ఆచరణ చేత గాని వాగ్దానం
కోటలు దాటే మాటలు
ఉపయోగించుకోలేని తెలివి తేటలు... ఎందుకు?
ఈ ప్రశ్నల్ని ఎవరూ వేసుకోరు...ఎందుకో...
ఆ ప్రశ్నలు వేసుకుంటే వస్తుంది కదా మార్పు...
అందుకే ప్రశ్నించుకున్నాక,మార్పు చెందాక అవుతావు నువ్వు నిప్పు
నీ చేతుల్లోనే ఉంటుంది కదా అప్పుడు తుది తీర్పు..
