STORYMIRROR

Midhun babu

Inspirational

4  

Midhun babu

Inspirational

ఎందుకో ఈ పరుగు...

ఎందుకో ఈ పరుగు...

1 min
272


పరుగెడుతున్నా పరుగెడుతున్నా

శక్తినంతా పిక్కలలోకి పుంజుకుని

రహదారుల వెంట రోడ్లవెంట

వెనుదిరిగి చూడకుండా పరుగెడుతున్నా

అక్కడక్కడా చలువపందిళ్లు ,చలివేంద్రలు

ఆగుదామనుకున్నా...

అవసరం లేదు

పరుగెడుతూనే వున్నా

ఆగోడ క్రింద ఈ గుమ్మం నీడ

ఆశతో పిలుస్తున్నారు చేతులతో !అంగనలు

ఆగనా?

సేద తీరనా

ఆగను...

పరుగు సాగిస్తున్నా

వరి చేలవెంట హల చాలు వెంట

కడలి తీరంలో కాళ్ళీడ్చుకుంటూ

వనాల లోన భవనాల నీడ

ముళ్లకంచెలపై ముష్టిరాళ్లపై

మడిమలో రక్తం మస్తిష్కములో మూలుగు

అక్కడక్కడ క్రూరజంతువులు పెంచాయి నా వేగం

పరుగెడుతూనే వున్నా

కొండలలో బండలలో

చేరుకున్నా ఓ ఏడారిని

కుక్షి కేకవేసింది ఆకలని

కుత్తుక దప్పితో పిడచకట్టుక పోతూంది

ఆహా కోనేరు అతి నిర్మల నీరు!

దోసిలితో పైకెత్తా

చేతులలో ఇసుక!

ఎండమావిలో నీరు త్రాగాలనుకున్నా!

ఒక్కటీ కనుపించదే ఒయాశీస్సు?

ఐనా పరుగెడుతున్నా

లక్ష్యం తెలియని లక్ష్యానికి

ఉన్నవి వదులుకుని లేని వానీకై

ఇదేనా జీవితం!?


   


Rate this content
Log in

Similar telugu poem from Inspirational